ఓర్నీ  వెంకటాశయః

ఓర్నీ  వెంకటాశయః

పెన్షన్ డబ్బు మాయం
అన్నమయ్య జిల్లాలో సంచలనం
రూ.4.80లక్షలతో లైన్మెన్ పరారీ

ఆంధ్రప్రభ, కురబలకోట : వృద్ధులకు, వికలాంగులకు ఓ సచివాలయ ఉద్యోగి ఎసరు పెట్టాడు. పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామసచివాలయంలో ఈ చేతివాటం వెలుగులోకి వచ్చింది. రూ.4.80లక్షలతో సచివాలయ లైన్ మెన్ ఊడాయించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట ఎంపీడీఓ గంగయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కురబలకోట మండలం తెట్టు సచివాలయంలో అంగళ్లు గ్రామానికి చెందిన వెంకటేష్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ భరోసా సామజిక పింఛన్ల పంపిణీ బాధ్యతను వెంకటేష్ కు అప్పగించారు. సోమవారం ఉదయం మొత్తం 80 మంది లబ్ధిదారులకు రూ.4.90 లక్షలు పంపిణీ చేయాలి. ఆ డబ్బు తీసుకున్న వెంకటేష్ అదృశ్యమయ్యాడు. పెన్షన్ డబ్బులు అందలేదని వృద్ధులు గగ్గోలు పెట్టటంతో ఈ విషయంపై ముదివేడు పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.

Leave a Reply