రైలు ప్రయాణం అంటే మనందరికీ ఒక ప్రత్యేకమైన అనుభవం. దూరప్రయాణం చేయాలనుకున్నప్పుడు చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది ట్రైన్ జర్నీనే. కుటుంబంతో ట్రిప్ వెళ్ళాలన్నా, ఊరికి వెళ్ళాలన్నా లేదా ఉద్యోగం, చదువు, వ్యాపారం కోసం కొత్త ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒకసారి ట్రైన్ టికెట్ బుక్ చేస్తే చాలు – ప్రయాణం సాఫీగా పూర్తవుతుంది. అందుకే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది రెగ్యులర్‌గా ట్రైన్‌లోనే ప్రయాణించడం మనం తరచూ చూస్తుంటాము.

కానీ మనం ఎప్పటికప్పుడు ఉపయోగించే ఈ రైలు వ్యవస్థలో కూడా ఒక ప్రత్యేకమైన విభజన పద్ధతి ఉందని మీకు తెలుసా? భారతీయ రైల్వేలో ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు – డివిజన్, జోన్, ఇంటర్ స్టేట్. ప్రతి స్థాయికి అనుగుణంగా రైలు రద్దీ, ట్రాక్ నిర్మాణం వేరుగా ఉంటుంది.

డివిజన్ స్థాయిలో సాధారణంగా సింగిల్ ట్రాక్‌నే ఉపయోగిస్తారు. జోన్ స్థాయికి చేరుకుంటే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల డబుల్ ట్రాక్‌లు అవసరం అవుతాయి. ఇక ఇంటర్ స్టేట్ స్థాయిలో, అంటే రాష్ట్రాల మధ్య నడిచే రైళ్ల కోసం ట్రిపుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ట్రాక్‌ల విభజనతో రైళ్లు మరింత సౌకర్యవంతంగా, సమయపాలనతో నడుస్తూ… ప్రయాణికుల జీవనంలో అంతర్భాగంగా మారుతున్నాయి.

డివిజ‌న్, జోన‌ల్, ఇంట‌ర్ స్టేట్ అంటే ఏంటి..

🔹 డివిజన్ స్థాయి

డివిజన్ అనేది రైల్వేలో చిన్న పరిపాలనా యూనిట్. ఒక నగరం లేదా కొన్ని జిల్లాలను కవర్ చేస్తుంది. సాధారణంగా డివిజన్ స్థాయిలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఇక్కడ సింగిల్ ట్రాక్‌నే ఏర్పాటు చేస్తారు. అంటే ఒకే లైన్‌లో రైళ్లు నడుస్తాయి, ఒక రైలు వెళ్ళాక మరొకటి వస్తుంది.

తెలంగాణలో రెండు రైల్వే డివిజన్లు ఉన్నాయి: సికింద్రాబాద్, హైదరాబాద్.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైల్వే డివిజన్లు ఉన్నాయి: విజయవాడ, గుంటూరు, గుంటకల్.

ఈ డివిజన్లన్నీ కలిపి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) పరిధిలో ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. అంటే తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎక్కువ రైలు సదుపాయాలను ఈ SCR జోన్‌నే పర్యవేక్షిస్తుంది.

🔹 జోన్ స్థాయి

జోన్ అనేది పలు డివిజన్ల సమూహం. అంటే డివిజన్ కన్నా పెద్ద పరిపాలనా యూనిట్. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 19 రైల్వే జోన్లు ఉన్నాయి. ఉదాహరణకు, దక్షిణ మధ్య రైల్వే (SCR), దక్షిణ రైల్వే (SR), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) వంటి జోన్లు.

జోన్ స్థాయిలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ డబుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. అంటే రెండు ట్రాక్‌లు ఉంటాయి – ఒకదాని మీద రైళ్లు ఒక దిశలో వెళ్తాయి, మరొకదాని మీద తిరిగి వస్తాయి. దీని వల్ల ట్రాఫిక్ తగ్గి రైళ్లు వేగంగా నడుస్తాయి.

తెలంగాణలో రైల్వే జోన్ : తెలంగాణ మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలోనే ఉంటుంది. ఈ జోన్‌లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా చేరుతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్లు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం పలు రైల్వే జోన్లలో విస్తరించి ఉంది.

SCR → విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిసి దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌.
ECoR → విశాఖపట్నం డివిజన్ కలిసి తూర్పు తీర రైల్వే (ECoR) జోన్‌ను ఏర్పడింది.
SCoR → దక్షిణ తీర రైల్వే (SCoR) – 2019లో ప్రకటించబడిన కొత్త జోన్. ప్రధాన కార్యాలయం విశాఖపట్నం ఉంది.

🔹 ఇంటర్ స్టేట్ స్థాయి

ఇంటర్ స్టేట్ రైళ్లు అనేవి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి నడిచే రైళ్లు. ఇవి పొడవైన మార్గాల్లో నడుస్తూ, రెండు రాష్ట్రాలకే కాకుండా అనేక రాష్ట్రాలను కూడా కలుపుతాయి. రాష్ట్రాల మధ్య నడిచే రైళ్ల రద్దీ మరింత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ట్రిపుల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. అంటే ఒకేసారి అనేక రైళ్లు విభిన్న దిశల్లో సులభంగా ప్రయాణించగలవు.

తెలంగాణలోని ప్రధాన ఇంటర్ స్టేట్ రైళ్లు (హైదరాబాద్ / సికింద్రాబాద్ నుంచి):

హైదరాబాద్ → ఢిల్లీ – రాజధాని ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ → ముంబై – దేవగిరి ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ → చెన్నై – చార్మినార్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ → బెంగళూరు – కాచిగూడ–యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఇంటర్ స్టేట్ రైళ్లు (విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి):

విజయవాడ → ఢిల్లీ / హౌరా – ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం → భువనేశ్వర్ / హౌరా – కోణార్క్ ఎక్స్‌ప్రెస్
తిరుపతి → చెన్నై / బెంగళూరు – రోజువారీ అనేక రైళ్లు
గుంటూరు / గుంటకల్ → ముంబై – ప్రధాన కనెక్టివిటీ

ఇలా తెలంగాణ నుంచి ఉత్తర, పశ్చిమ, దక్షిణ భారత దేశానికి కనెక్టివిటీ ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు, ఉత్తర, దక్షిణ భారత దేశాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా డివిజన్, జోన్, ఇంటర్ స్టేట్ విభజనలతో భారతీయ రైల్వే మరింత సమర్థవంతంగా పని చేస్తూ, కోట్లాది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందిస్తోంది.


రైలు ప్రయాణం డివిజన్, జోన్, ఇంటర్ స్టేట్ స్థాయిల్లో మాత్రమే పరిమితం కాదు. భారతీయ రైల్వే సర్వీస్‌లో ప్రయాణికులకు మరో ప్రత్యేక అవకాశం కూడా ఉంది. అదే అంతర్జాతీయ రైళ్లు. అవును! మన దేశం నుంచి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాలకు నేరుగా వెళ్లే రైలు సర్వీసులు ఉన్నాయి.

ఇవి మన దేశంలోని ఒక ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరి, సరిహద్దులు దాటి మరొక దేశంలోని స్టేషన్‌ వరకు ప్రయాణికులను తీసుకెళ్తాయి. సాధారణ రైళ్ల మాదిరి కాకుండా, వీటికి అంతర్జాతీయ ప్రయాణానికి అనుగుణంగా కఠినమైన భద్రతా తనిఖీలు, కస్టమ్స్‌ & ఇమిగ్రేషన్‌ ప్రక్రియలు కూడా ఉంటాయి.

కానీ, కొన్నేళ్లుగా వివిధ కారణాల వల్ల వీటిలో చాలా అంతర్జాతీయ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇవి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భార‌త్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ర్వీస్ లు ఇవే !

భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య రైళ్లు

భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు కనెక్టివిటీ ఇచ్చే మూడు ప్రధాన రైళ్లు ఉన్నాయి.

  • మైత్రి ఎక్స్‌ప్రెస్ (Maitree Express) :
    ఈ రైలు 2008లో ప్రారంభమైంది. కోల్‌కతా – ఢాకా మధ్య నడిచేది. ఇది రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలిచింది.
  • బంధన్ ఎక్స్‌ప్రెస్ (Bandhan Express) :
    2017లో ప్రారంభమైన ఈ రైలు కోల్‌కతా – ఖుల్నా (బంగ్లాదేశ్) మధ్య నడిచేది.
  • మితాలి ఎక్స్‌ప్రెస్ (Mitali Express) :
    2022లో ప్రారంభమైన తాజా రైలు. ఇది న్యూ జల్పైగురి (సిలిగురి) నుంచి ఢాకా వరకు నడిచేది.

అయితే, ఈ మూడు రైళ్లు 2024 జూలై నుంచి అనిర్దిష్టంగా నిలిపివేయబడ్డాయి. కారణం, బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అశాంతి.

భారతదేశం – పాకిస్తాన్ మధ్య రైళ్లు

గతంలో భారత్–పాక్ మధ్య కూడా రెండు ముఖ్యమైన రైళ్లు నడిచేవి.

  • సమ్జౌతా ఎక్స్‌ప్రెస్ (Samjhauta Express) :
    1976 నుంచి ఢిల్లీ – లాహోర్ మధ్య నడుస్తూ, రెండు దేశాల ప్రజలకు అనుసంధానం ఇచ్చేది. కానీ 2019 నుంచి పూర్తిగా నిలిపివేయబడింది.
  • థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ (Thar Link Express) :
    2006 నుంచి జోధ్‌పూర్ (భారత్) – మునాబావ్ – ఖోఖ్రాపార్ (పాక్) వరకు నడిచేది. కానీ ఇప్పుడు ఇది కూడా రద్దయింది.

భారతదేశం – నేపాల్ మధ్య రైలు

నేపాల్‌తో రైల్వే కనెక్టివిటీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ జయనగర్ – కుర్తా (Jaynagar–Kurtha) ప్రయాణికుల రైలు. ఈ రైలు బీహార్ రాష్ట్రంలోని జయనగర్ నుంచి నేరుగా నేపాల్‌లోని కుర్తా వరకు నడవనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే.. భారత్ నుంచి నేపాల్‌కు నేరుగా వెళ్ళే తొలి బ్రాడ్ గేజ్ ప్రయాణికుల రైలుగా ఇది చరిత్ర సృష్టించనుంది.

ఇక మొత్తానికి చెప్పాలంటే, ప్రస్తుతానికి భారతదేశం నుంచి ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణికుల రైళ్లు నడవడం లేదు.

Leave a Reply