- నిద్రలో ఉన్న తల్లి, కుమార్తెలకు కాటు
- కుమార్తె మృతి.. అపస్మారక స్థితిలో తల్లి
సత్తుపల్లి : వరద నీటితో ఇంట్లోకి చేరిన ఓ కట్ల పాము తల్లీ, కుమార్తె (MotherAndDaughter)ను కాటు వేసిన సంఘటన గ్రామస్థులను కలచివేసింది. అందులో కుమార్తె మృతి చెందగా, అపస్మారక స్థితికి చేరిన తల్లిని ఖమ్మం (Khammam) ఆస్పత్రికి తరలించారు.
ఇలా కాటు వేసింది!
చిన్న పాకలగూడెం గ్రామంలోని గౌర గోపి ఇంట్లోకి చేరిన వరదలో కట్ల పాము చేరింది. అయితే పాము (Snake) ఉన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియదు. నిద్రలో ఉన్న కుమార్తె లోహిత (Lohita), ఆమె తల్లిని కూడా కాటేసింది. పరిస్థితి గమనించిన ఇంటి యజమాని గోపి దాన్ని చంపి అపస్మారక స్థితికి చేరిన తల్లి, కూతుళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందగా, అపస్మారక స్థితికి చేరిన భార్యను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం (Khammam) తరలించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. సమాచారం అందుకున్న శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు కుటుంబాన్ని పరామర్శించారు.