- సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు
ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి (Ellareddy) మండలం బొగ్గ గుడిసె చౌరస్తా వద్ద కళ్యాణి ప్రాజెక్టు వాగులో ఆరుగురు చిక్కుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. అయితే బొగ్గ గుడిసె చౌరస్తా వద్ద కళ్యాణి ప్రాజెక్టు (Kalyani Project) వాగు, తిమ్మారెడ్డి వాగు కలిసే చోట ఉన్న దిబ్బ మీదకు ఆరుగురు వెళ్లారు.
ఇంతలో నీటి ఉధృతి పెరగడంతో వారు చిక్కుకుపోయారు. ఇది గమనించిన బొగ్గ గుడిసె గ్రామస్థులు (villagers) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. వారిని రప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.