గంజాయి విక్రయిస్తున్న ప‌ది మంది అరెస్టు..

మాడుగుల పల్లి (ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా) : మిర్యాలగూడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి ని విక్రయిస్తున్న ప‌ది మంది నిందితులను మాడుగులపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మీడియాకు వివరించారు. నిందితుల నుంచి1350 గ్రాముల గంజాయి, 22 గంజాయి చాక్లెట్లు, 8 సెల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply