హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly Sessions) ఈనెల 30నుంచి నిర్వ‌హించ‌డానికి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఐదు రోజుల మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. దీనిపై స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు.

జిస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి (Advocate General Sudarshan Reddy) శుక్రవారం హైకోర్టు (High Court) కు తెలియ‌జేసిన సంగ‌తి విదిత‌మే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అందిన నివేదకను అసెంబ్లీలో ప్రవేశపెడతామని.. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు.

Leave a Reply