పెద్దపల్లి : వర్షాకాలం(rainy season)లో పాములు (snakes) ఎక్కడైనా సంచరించే ఆస్కారం ఉంటుంది. పరిసరాలు, విద్యుత్ తీగలు (power lines) చూసుకోకుండా అన్నదాతలు (breadwinners) వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటారు. రైతులు అప్రమత్తం లేకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సంఘటనలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla district) గంభీరావుపేట (Gambhiraopet) మండల కేంద్రంలోని రైతు హమీద్ పొలం వద్దకు వెళ్లారు. విద్యుత్ సర్వీస్ తీగపై పొడవుగా ఉన్న పామును ఫోటోలో బంధించాం. పాములు పొలాల్లో, గట్ల వెంబడి సంచరించడం సహజమే కానీ.. ఇలా విద్యుత్తు తీగ (Electric Wire)పై సేదదీరడం చూడలేదని పలువురు రైతులు అంటున్నారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలపై కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి.