కన్నబిడ్డ ముందే.. చంపేశాడు

ఔను అమ్మను చంపేశారు. నాన్నే చంపేశాడు. పక్కనే నానమ్మ కూడా ఉంది. అని ఓ ఆరేళ్ల బాలుడు ప్రత్యక్ష సాక్ష్యం. చిన్నారుల సాక్ష్యాన్ని కోర్టు స్వీకరిస్తుందో లేదో..గానీ.. యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఓ ఇల్లాలి కిరాత హత్మకు ఆమె బిడ్డే ప్రత్యక్షసాక్షిగా నిలిచాడు. ఈ కిరాత హత్యను అదే సమయంలో మృతురాలి సోదరి చిత్రీకరించింది. సోషల్ మీడియాకు విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘాతుక చర్య దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఉత్తర నొయిడాలోని కస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా అనే గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. నిక్కీ అనే ఇల్లాలిని భర్త అమానుషంగా చంపేశాడు. అదనపు కట్నం రూ.36 లక్షలు చెల్లించలేదని.. తాళి కట్టించుకున్న భార్య జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. నిప్పంటించాడు. అదే సమయంలో నిక్కీ సోదరి అక్కడే ఉంది. తన సోదరిని హింసిస్తున్న దృశ్యాలను చిత్రీకరించింది. ఆ తరువాత మంటల్లో సజీవ దహనమవుతున్న తన అక్కను కాపాడుకోలేక అల్లాడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక మృతురాలి కొడుకు .. ఏమి జరిగిందో.. పూసగుచ్చి చెప్పేస్తున్నాడు.

Leave a Reply