పెద్దపల్లి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM) దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రముఖ వ్యాపారవేత్త సురభి వైద్య కళాశాల చైర్మన్ హరేంద్రరావు భేటీ అయ్యారు. శనివారం ముంబయిలో మహారాష్ట్ర సీఎంని కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం వైద్య రంగంలో ముంబయి (Mumbai) లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. తమ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు హరేంద్రరావు తెలిపారు.
మహారాష్ట్ర సీఎంతో హరేంద్రరావు భేటీ
