( ఆంధ్రప్రభ, అనంతపురం) : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని కలకన్నారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. ఆమెను వీడలేక.. అతడు తనకు తానే తనువీడాడు. ఈ ప్రేమికుడి విషాద గాధ ఇది. అనంతపురం (Anantapur) జిల్లా బత్తులపల్లి మండలం రాఘవంపల్లికి చెందిన యువకుడు గుణ (Guna) (20) ప్రేమ పెళ్లికి బంధువులు నిరాకరించారన్న మనస్తాపంతో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బత్తులపల్లి ఎస్‌ఐ (Bathulapalli SI) వివరాలిలా ఉన్నాయి. రాఘవంపల్లి గ్రామ రైతు నరసింహుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు గుణ పదో తరగతి వరకు చదివాడు.

ప్రస్తుతం ఇంటి వద్దే పొలం పనుల్లోకి వెళ్తున్నాడు. బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ పెద్దలకు తెలిసింది, అమ్మాయి తల్లిదండ్రులు (parents) ఈ ప్రేమను ఆంగీకరించలేదు. ఇక ఆమె తనకు దక్కదని గుణ మనస్తాపం చెందాడు. ఇంటి ఆవరణలోని మామిడి చెట్టు (Mango tree) కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అతడు కనిపించకపోవడంతో కుటుంబీకులు తోటలో వెతకగా.. మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుణ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు (case Registration) చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply