TG | మూడు రోజులపాటు మరింత పెరగనున్న ఎండల తీవ్రత
- హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది.
ఖమ్మం, భద్రాచలంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.
కాగా ఈరోజు (సోమవారం) రాష్ట్రంలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. రానున్న మూడు రోజుల పాటు తూర్పు, ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.