మరణించిన వారంతా…

చైనాలో నిర్మాణ దశలో ఉన్న ఓ భారీ రైల్వే వంతెన కుప్పకూలి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. యెల్లో రివర్ పై శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఈ వంతెన సిచువాన్-కింగ్‌హై రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మాణం జరుగుతోంది. ప్రమాదం సంభవించిన సమయంలో సైట్‌లో 16 మంది సిబ్బంది, అందులో ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉన్నట్టు తెలుస్తొంది. నిర్మాణంలో ఉపయోగిస్తున్న స్టీల్ కేబుల్ ఒక్కసారిగా తెగిపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చైనా ప్రభుత్వం తెలిపింది.
వంతెన కూలిన వెంటనే పది మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మరణించారు. మిగతా నలుగురి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.వంతెనకు చెందిన ప్రధాన ఆర్చ్ నిర్మాణ భాగం ఒక్కసారిగా కూలిపోయి నదిలో పడిపోయిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
