- కదిలిన పునాదిరాళ్లు… రాచకొండలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు
హైదరాబాద్, వాజేడు : ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లో మవోయిస్టు పార్టీ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఒకవైపు ఆపరేషన్ కగార్ (Operation Kagar).. మరో వైపు గ్రామాల్లోకి రండి పునరావాస పథకానకి స్పందిస్తూ… విప్లవ బాటను సిద్ధాంతకర్తలు సైతం వీడుతున్నారు. తాజాగా ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. గురువారం రాచకొండ పోలీసు కమిషనర్ (Police Commissioner) సుధీర్ ఎదుట మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత సీపీ ఎదుట లొంగిపోయారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేశారు. సునీతపై కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. వరవరరావు (Varavara Rao), గద్దర్ (Gaddar) ఆమె ఇంటికి వస్తుండటంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. ఆమె 1986లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 1986 ఆగస్టులో టీఎల్ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్ వివాహం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్ (Central Organizer) గా పనిచేశారు. 1992లో నల్లమల అడవుల్లోకి వెళ్లారు.
2001లో ఏవోబీ ప్రాంతానికి, 2006లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ కూడా ఇవాళ లొంగిపోయారు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడు ఏటూరు నాగారం (Eturu Nagaram) బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మావోయిస్టు సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. 2024లో ఏసీఎంగా పనిచేశారు. వీరిద్దరూ ఎన్నో ఎన్ కౌంటర్లలో పాల్గొన్నారు. జనజీవన స్రవంతిలో పాల్గొనడం మంచి పరిణామం” అని సీపీ తెలిపారు.