- కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్ : తెలంగాణ (Telangana) లో రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలు కేటాయింపులకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలు (Liquor stores) లైసెన్స్ నవంబర్‌తో ముగియనుంది.
మొత్తం ఆరు స్లాబ్‌లుగా లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు (Reservations) ప్రభుత్వం కల్పించింది. కొత్త రిజర్వేషన్ ప్రకారం.. గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు ఐదు శాతం మద్యం దుకాణాలు కేటాయించారు.
లైసెన్స్ ఫీజు వివరాలు..
2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వం లైసెన్స్ ఫీజు (license fees) నిర్ణయించింది. ఒక ఏడాదికి ఐదు వేలు జనాభా లోపు ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణానికి రూ.50 లక్షలు, ఐదు వేల జనాభా పైనా 50వేల లోపు జనాభా కలిగిన ప్రాంతం మద్యం దుకాణానికి రూ.55 లక్షలు, లక్ష లోపు జనాభా ప్రాంతంలో మద్యం దుకాణానికి (liquor store) అరవై లక్షలు, ఐదు లక్షల జనాభా కలిగిన ప్రాంతంలో మద్యం దుకాణానికి రూ.65 లక్షలు, 20లక్షల లోపు జనాభ కలిగిన ప్రాంతంలో దుకాణానికి రూ.85లక్షలు 20 లక్షలు జనాభా కలిగిన ప్రాంతంలో రూ.110 లక్షలు ఫీజును ప్రభుత్వం (Government) నిర్ణయించింది.