కాళేశ్వ‌రంలో మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌..

  • ప్ర‌మాదాపు అంచుల్లో గోదావ‌రి…


భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి : తెలంగాణ (Telangana) లో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటం, సరస్వతి బ్యారేజ్ నుండి గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. గోదావ‌రి ప్ర‌వ‌హం గంట గంట‌కు పెరుగుతోంది. ప్ర‌స్తుతం గోదావ‌రి (Godavari) ఉగ్ర‌రూపం దాల్చుతుంది. బుధవారం ఉదయం జయశంకర్ జిల్లా మహాదేవపూర్ (Mahadevpur) మండలం కాళేశ్వ‌రం ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 12.510 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


కాళేశ్వ‌రం (Kaleshwaram) వ‌ద్ద 13.460 మీటర్లుకు నీటి మ‌ట్టం చేరితే డేంజర్ పొజిష‌న్‌(Danger position). అయితే సాయంత్రానికి డేంజ‌ర్ పొజిష‌న్‌కు చేరే అవ‌కాశం ఉంది. దీంతో అధికారులు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తమ‌వుతున్నారు. గోదారి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి, వరి పంట పొలాలు నీటి మునిగాయి. మహాదేవపూర్ మండలంలోని చంద్రుపల్లి వెళ్లే దారిలో కాజ్ వే ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామంతో ఇత‌ర గ్రామాల‌కు సంత్సంబంధాలు తెగిపోయాయి. మేడిగడ్డ లక్ష్మిబ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) కు 9,02,550 నీరు వస్తుండడంతో 85 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో అవుట్ ఫ్లో పంపిస్తున్నారు.

Leave a Reply