జగిత్యాల : మహారాష్ట్ర వరదల్లో (MaharashtraFloods) గల్లంతైన జగిత్యాలకు చెందిన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం జగిత్యాల టి.ఆర్. నగర్ కు చెందిన పాషా భార్య హసీనా గా గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నిన్న మహారాష్ట్రలో జరిగిన వరద ప్రమాదంలో జగిత్యాల టిఆర్ నగర్ (Jagtiala TR Nagar) కు చెందిన ఆఫ్రిన్, సమీనా, హసీనా అనే ముగ్గురు మహిళలు (Three womens) గల్లంతయ్యారు.
మహారాష్ట్రలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న కారు నాందేడ్ జిల్లా (Nanded District) దెగ్లూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వరదల్లో చిక్కుకుంది. వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుండి షోహెబ్ తో పాటు డ్రైవర్ (Driver) చాకచక్యంగా బయటపడిన సంగతి తెలిసిందే. రాత్రి నుంచి గాలించగా ముగ్గురిలో ఒకరి మృతదేహం లభించింది. మిగిలిన ఇద్దరు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.