ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) జోష్‌తో ప్రారంభించాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ & పీ గ్లోబల్ భారత్ రేటింగ్‌ను ఎగదీసిన నేపథ్యంలో, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన జీఎస్‌టీ తగ్గింపు హామీ పెట్టుబడిదారులకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) భారీ లాభాల్లో ట్రేడవుతూ మార్కెట్ సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా మార్చాయి.

స్టాక్‌ మార్కెట్లు (Stock Market) భారీ లాభాల్లో (huge profits) ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్ (Sensex) 974 పాయింట్ల లాభంతో 81,585 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (Nifty) 320 పాయింట్ల లాభంతో 24,951 వద్ద ట్రేడవుతోంది. మన దేశ రేటింగ్‌ను ‘బీబీబీ-’ నుంచి ‘బీబీబీ’కి ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సవరించడంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. మరోవైపు దీపావళి కల్లా జీఎస్‌టీ భారాన్ని బాగా తగ్గిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్టాక్‌ మార్కెట్లకు ఉత్సాహం తెచ్చింది.

Leave a Reply