అల్లూరి : మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి, డివిజనల్ కమిటీ సభ్యుడు చైతో అలియాస్ నరేష్ అలియాస్ సంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ అధికారికంగా ప్రకటించారు.
జి.మాడుగుల మండల అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు చైతోను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు సమయంలో అతడు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారని వివరించారు.
అతని వద్ద నుండి రైఫిల్, పిస్టల్, లైవ్ కార్ట్రిడ్జులు, కిట్ బ్యాగులు, మావోయిస్టు ప్రచార పత్రాలు స్వాధీనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.