సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) మరో అంతర్జాతీయ ముఠాకు చెక్ పెట్టారు. ఉజ్బెకిస్థాన్ (Uzbekistan), తుర్క్మెనిస్థాన్ (Turkmenistan) తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన యువతులను వలలో వేసి, లగ్జరీ హోటళ్లలో వ్యభిచారం జరుపుతున్న రాకెట్‌ను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHIU) బృందం మాదాపూర్‌లో పట్టేసింది.

మాదాపూర్ (Madapur) లోని బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్‌లో సిబ్బంది సహకారంతో నడుస్తున్న ఈ వ్యభిచార దందాలో ఏడుగురిని పోలీసులు (police) అరెస్ట్ చేశారు. తొమ్మిది మంది యువతులను రక్షించారు. నాంపల్లి‌కు చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమీద్ సింగ్ ఈ రాకెట్‌కు కీలక సూత్రధారి (Key mastermind). అతడు నిఖిల్, సోనియాసింగ్, విశాల్ భయ్యా, శృతి, రోహిత్, రమేశ్ తదితరులతో కలిసి దేశీయ, విదేశీ యువతులను రప్పించి హోటల్ (hotel) లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

ఈ వ్యాపారం కోసం హోటల్ సూపర్‌వైజర్లు అయిన మహబూబ్ నగర్ (Mahabubnagar) కు చెందిన తమ్మి శ్రీనివాస్, కడపకు చెందిన కల వెంకటేశ్వర్లు తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కస్టమర్ల కోసం వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇస్తూ, గదులు బుక్ చేసి లావాదేవీలు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న AHIU ఇన్‌స్పెక్టర్ బృందం హోటల్‌పై దాడి చేసి నిందితులను పట్టుకుంది. వీరిపై కేసులు నమోదు చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

Leave a Reply