దేశంలోని టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ (ap) ని నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం (Indira Gandhi Stadium) లో వేడుకలను నిర్వహించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ … 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి సీఎంగా ప్రజలు తనకు అవకాశం కల్పించారన్నారు.
అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో (top 3 states) ఒకటిగా ఏపీని నిలిపామని చెప్పారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఏపీ బ్రాండ్ (AP brand) ను నాశనం చేసిందని విమర్శించారు. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగుచూస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
ప్రధాన ఎన్నికల హామీలైన ‘సూపర్ సిక్స్’ (Super Six) ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద కోట్లాది తల్లులకు ఆర్థిక భరోసా కల్పించామని, ‘ఎన్టీఆర్ భరోసా’ ద్వారా 64 లక్షల మందికి ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ (annadata sukhibhava) కింద 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,173 కోట్లు జమ చేశామని, ‘దీపం’ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.