కామన్వెల్త్ గేమ్స్-2030 బిడు

ఐవోఏ ఆమోదం

ఒలింపిక్స్ – 2036 (Olympics – 2036)కు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు భారత్ ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే విశ్వక్రీడలను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలియజేసింది. ఈ క్రమంలోనే కామన్వెల్త్ గేమ్స్ – 2030 (Commonwealth Games – 2030) ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేయగా ఫైనల్ బిడ్ (Final bid) దాఖలు చేసేందుకు ఈ నెల 31 తుది గడువు. ఈ నేపథ్యంలోనే బిడ్ చేయడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియే షన్ (Indian Olympic Association)(ఐవోఏ) దాఖలు ఆమోదం బుధవారం న్యూఢిల్లీలో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్లో బిడ్ ను ఆమోదించింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) జరిగాయి. ఆతిథ్య హక్కుల దక్కితే కామన్వెల్త్ గేమ్స్ – 2030 వేదికగా అహ్మదాబాద్ (Ahmedabad) ను పరిశీలిస్తునట్టు తెలుస్తోంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డానెల్ హాల్ నేతృత్వంలోని బృందం అహ్మదాబాద్లోని వేదికలను పరిశీలించింది. గుజరాత్ ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమైంది. ఈ నెలాఖరులో మరో బృందం భారత్ కు రానుంది. నవంబర్ చివరి వారంలో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో ఆతిథ్య దేశాన్ని నిర్ణంచనున్నారు. బిడ్ రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు భారత్ కే దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి.

Leave a Reply