మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..

బెంగళూరు : బెంగ‌ళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ‌ కీల‌క తీర్పు ఇచ్చింది. అత్యాచారం కేసు (rape case) లో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు జీవితఖైదు (Life Sentence) విధించింది. పనిమనిషిపై అత్యాచారం కేసులో అతనికి జీవితఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

అలాగే బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు (Court) ఆదేశించింది. కాగా.. 2021లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు (Allegations) రాగా.. రేప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ 2024, మే 21న అరెస్ట్ (arrest) అయ్యారు. ఆ తర్వాత పలువురు మహిళలు సైతం ప్రజ్వల్ రేవ‌ణ్ణ తమపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. విచారణ (investigation)లో భాగంగా ప్రజ్వల్ ఫోన్ ను తనిఖీ చేయగా, రెండు వేలకు పైగా వీడియోలు బయటపడ్డాయి. 14నెలల రిమాండ్ తర్వాత బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ‌ శిక్ష ఖరారు చేసింది.

Leave a Reply