Route Ready | హైదరాబాద్ నుంచి అయోధ్య కు వందేభారత్ స్లీపర్ రైళ్లు….

హైదరాబాద్ : రైల్వేలో మరో కొత్త అధ్యయం ప్రారంభం కానుంది. సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి.

వందేభారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రాంతాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ .. ట్రయిల్ రన్ పూర్తయింది. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే అధికారులు రూట్ ఖరారు చేస్తూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించారు.

పట్టెలెక్కేందుకు సిద్దంరైల్వే ప్రయాణీకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు కసరత్తు తుది దశకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రస్తుతం 136 మార్గాల్లో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రైళ్లు కొనసాగుతున్నాయి.

అయితే, వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేసారు. అందులో తెలుగు రాష్ట్రాలకు ఒకటి కేటాయించేలా నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి రూట్ పైనా స్పష్టత వచ్చింది.

కీలక ప్రతిపాదనలుఇప్పటికే వందేభారత్ స్లీపర్ ట్రయల్ రన్ సైతం విజయవంతం అయ్యింది. రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ముంబై- అహ్మదాబాద్‌ మార్గంలో 540 కిలో మీటర్ల దూరం ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఈ రైళ్లలో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి.

ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కసరత్తు

విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అయితే, తొలి విడతలో ఏ మేరకు సాధ్యం అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

రైల్వే అధికారులు ఈ రెండు ప్రతిపాదనల్లో ప్రయాణీకుల డిమాండ్.. రద్దీ గురించి నివేదికలు ఇవ్వనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ తెలుగు రాష్ట్రాలకు కేటా యింపు ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *