వాజేడు, జులై 30 ఆంధ్రప్రభ : ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండలం గుమ్మడిదొడ్డి పంచాయతీ ఇప్పగూడెం గ్రామానికి చెందిన మోడెం వంశీ (Modem Vamsi) పవర్ లిఫ్టింగ్ (Powerlifting) లో ఇండియా తరపున నార్త్ అమెరికా (North America) కి సెలెక్ట్ అయ్యారు. అయితే నార్త్ అమెరికా వెళ్లేందుకు సుమారు 3 నుండి రూ.4 లక్షలు ఖర్చు అవుతుంది.
నిరుపేద కుటుంబానికి చెందిన వంశీకి ఆర్థిక స్తోమత లేకపోవడంతో పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ (SI Gurram Krishna Prasad) ను సహాయం అడుగగా తనవంతుగా 5000 రూపాయలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ లిఫ్టింగ్ లో మంచిగా రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.