- మూవీ రన్ టైమ్ 2గంటల42 నిమిషాలు
- ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu ): పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు (Censor programs) పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు (Telugu), హిందీ (Hindi), తమిళం (Tamil), కన్నడ (Kannada), మలయాళ (Malayalam) భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం జులై 20న విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కొంత భాగం దర్శకత్వం వహించగా, మిగతా పార్ట్ ను ఏఎం జ్యోతికృష్ణ (AM Jyothikrishna) పూర్తిచేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఒక పవర్ ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, కన్నులపండుగలా ఉంటుందని అంచనా. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.