Wimbledon 2025 | డ‌బుల్స్ క‌ప్పు కొట్టిన క్యాష్ – లాయిడ్ గ్లాస్‌పూల్

  • 1936 తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించిన బ్రిటిష్ జోడీ

వింబుల్డన్ 2025 పురుషుల డబుల్స్ ఫైనల్‌లో జూలియన్ క్యాష్ – లాయిడ్ గ్లాస్‌పూల్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. 1936 తర్వాత పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి బ్రిటిష్ జంటగా వీరు రికార్డు సృష్టించారు.

ఈరోజు (శనివారం) సెంటర్ కోర్టులో అభిమానుల హర్షధ్వానాల మధ్య జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో క్యాష్-గ్లాస్‌పూల్ జంట ఆస్ట్రేలియన్-డచ్ జంట రింకే హిజికాటా-డేవిడ్ పెల్‌ను 6-2, 7-6(3) తేడాతో ఓడించింది. కాష్-గ్లాస్‌పూల్ జంట కేవలం ఒక గంట 23 నిమిషాల్లో ఈ చారిత్రక విజయం సాధించింది.

ఐదో సీడ్ జంట క్వీన్స్ క్లబ్, ఈస్ట్‌బోర్న్ టైటిళ్లను గెలుచుకోగా.. ఈ విజయంతో డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి బ్రిటిష్ జంటగా మరో ఘనతను సాధించింది. చివరిసారిగా ఈ ఘనతను పాట్ హ్యూస్ – రేమండ్ టకీ 1936లో సాధించారు, ఇప్పుడు దాదాపు 89 సంవత్సరాల తర్వాత, వారు మరోసారి ఈ అరుదైన ఘనతకు వారసులుగా మారారు. కాగా, క్యాష్ – గ్లాస్‌పూల్‌లకు ఇది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విషేశం.

Leave a Reply