KL Rahul | కేఎల్ క్లాసిక్ సెంచ‌రీ.. వెంటనే చేజారిన వికెట్ !

  • భార‌త్ 254కి 5 వికెట్లు డౌన్

లార్డ్స్‌లో కెఎల్ రాహుల్ మరోసారి తన అసాధారణ స్థిరత్వం, సహనాన్ని ప్రదర్శించాడు. తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో మరోసారి ఆకట్టుకున్న కెఎల్ రాహుల్, 176 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, భారత్ తరఫున కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే శతకం పూర్తి చేసిన వెంటనే తన వికెట్ వదిలేశాడు. బషీర్ వేసిన బంతికి రాహుల్ ఎడ్జ్ ఇచ్చి ఫస్ట్ స్లిప్‌కి చిక్కాడు. భారత్ స్కోరు 254 పరుగులు, 5 వికెట్లు వద్ద నిలిచింది.

అయితే, ఆ సెంచరీ సంబురం ఎక్కువసేపు నిలవలేదు. సెంచరీ చేసిన తర్వాతి బంతికే కేఎల్ వికెట్ కోల్పోయాడు.బషీర్ వేసిన బంతిని రాహుల్‌ ఎడ్జ్ ఇచ్చి ఫస్ట్ స్లిప్‌లో చిక్కేశాడు. దీంతో భారత్ 254 పరుగుల వ‌ద్ద 5వ వికెట్ కోల్పోయింది.

ఇదిలా ఉంటే, రాహుల్ కి ఇది లార్డ్స్‌లో రెండో శతకం కాగా, మొత్తం టెస్ట్ కెరీర్‌లో 10వ శతకం కావ‌డం విషేశం. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో భారత్ తరఫున ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ స్థానం పొందాడు.
•6 – రాహుల్ ద్రావిడ్
•4 – రిషబ్ పంత్
•4 – సచిన్ టెండూల్కర్
•4 – దిలీప్ వెంగసర్కార్
•4 – కేఎల్ రాహుల్*

అదే సమయంలో లార్డ్స్‌లో భారత్ తరఫున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు.
• 3 – దిలీప్ వెంగసర్కార్
• 2 – కేఎల్ రాహుల్*

Leave a Reply