ఖమ్మం వైద్య విభాగం, జులై 11(ఆంధ్ర ప్రభ) : ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ (Superintendent) గా డాక్టర్ ఎం. నరేందర్ (Narender) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ( డీఏంఈ) బదిలీల్లో భాగంగా డాక్టర్ వికారాబాద్ మెడికల్ కాలేజీ (Vikarabad Medical College) లో పల్మోనాలజిస్ట్ విభాగంలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేందర్ ను పదోన్నతి కల్పిస్తూ ఖమ్మం జీజీహెచ్ సూపరింటెండెంట్ కు కేటాయించారు. శుక్రవారం ఉదయం జీజీహెచ్ పాత సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి భాద్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతన సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ను జీజీహెచ్ వైద్యులు, ఉద్యోగస్తులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
KHM | జీజీహెచ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నరేందర్..
