హైదరాబాద్ – బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్ (BJPMLA Raja singh) చేసిన రాజీనామాను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (BJP Chief JP nadda ) ఆమోదించారు.. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష (State president ) ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నెల 30వ తేదిన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి అందజేశారు.. అందులో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామ చేస్తునట్లు పేర్కొన్నారు.. నేడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ లేఖను నడ్డా విడుదల చేశారు.. అలాగే రాజాసింగ్ ప్రస్తావించిన అంశాలు అసంబద్ధంంగా ఉన్నాయన్నారు జేపీ నడ్డా. పార్టీ పనితీరు, భావజాలం, సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తేల్చి చెప్పారు..
