AA22 | మ‌రోసారి బ‌న్నీతో నేష‌న‌ల్ క్ర‌ష్ !

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా చిత్రంతో మంచి విజయం సాధించిన నటి రష్మిక మందన్నా, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతున్న‌ AA22 సినిమాలో రష్మిక మందన్నా ముఖ్యపాత్ర పోషించనుందని తెలుస్తోంది.

దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా ఎంచుకోబడ్డారు. మరికొందరు ప్రముఖ హీరోయిన్ల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌తో పుష్ప సిరీస్‌లో జతకట్టిన రష్మికను కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ – రష్మిక కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపిస్తుందన్న వార్తతో ఫ్యాన్స్‌లో ఆనందం వ్యక్తమవుతోంది. దీపిక, రష్మిక తో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి నాలుగు పెద్ద హీరోయిన్ల‌ను కూడా తీసుకోబోతున్నట్లు టాక్ ఉంది. దీంతో సినిమాపై అంచనాలు మించి పెరుగుతున్నాయి.

Leave a Reply