Greetings | తొలి ఏకాద‌శి – శుభాకాంక్ష‌లు తెలిపిన రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు

ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా, తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పవిత్ర దినాన విష్ణువును ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల భక్తులు ఆశీర్వాదాలను పొందుతారని, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారని నమ్మకం. ఈసందర్భంగా తెలంగాణ‌, ఎపి ముఖ్య‌మంత్రులు (ap and telangana cm s ) త‌మ ఎక్స్ వేదిక‌ల ద్వారా తెలుగు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు (greetings ) తెలిపారు.

రేవంత్ రెడ్డి..

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (cm revanth reddy ) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని త‌న సందేశంలో కోరారు.

చంద్రబాబు నాయుడు ….

“తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. తొలి పండుగగా భావించే ఈ తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలతో రాష్ట్రం శోభాయమానంగా విలసిల్లాలని కోరుకుంటున్నాను” అని చంద్ర‌బాబు (chandrababu) పేర్కొన్నారు.

Leave a Reply