New Party| అన్నంత పని చేసిన ఎలాన్ మస్క్

అమెరికా బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ”అమెరికా పార్టీ” పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.

ట్రంప్‌ కలల బిల్లు అయిన ‘వన్‌ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు’ను ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేస్తానని మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌ల మధ్య వివాదం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కొత్త పార్టీ ఏర్పాటుపై మస్క్ ఎక్స్ లో పోస్టు చేశారు. అమెరికా ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా హామీ ఇచ్చారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఉన్న ఎలాన్ మస్క్ గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయనకు సన్నిహితుడిగా మారారు. దీంతో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాన్ మస్క్‌ కీలక సలహాదారుగా వ్యవహరించారు. ట్రంప్ పాలనలో ప్రభుత్వ సామర్థ్య విభాగం (డీవోజీఈ) కింద ఖర్చు తగ్గించే ప్రయత్నానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించారు. అయితే గత కొంతకాలంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మే నెల చివరిలో ట్రంప్ పరిపాలన నుంచి వైదొలుగుతున్నట్టుగా ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటన చేశారు.

Leave a Reply