IND vs ENG | ప్రమాదకరంగా మారిన బ్రూక్-స్మిత్ జోడీ

  • ప‌రుగులు పెడుతున్న ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు
  • వికెట్ల కోసం భారత్ క‌ష్టాలు

టెస్ట్ మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లాండ్ ఎదురుదాడి దిగింది. హ్యారీ బ్రూక్ (140) – జేమీ స్మిత్ (169) ల జోడి భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ రోజు రెండో ఓవర్‌లోనే ఇంగ్లాండ్ 84/5 వద్ద నిలిచిన దశలో నుంచి, బ్రూక్-స్మిత్ జోడీ ఇంగ్లాండ్‌ను తిరిగి గాడిలో పడేసింది.

వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 271 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయ‌గా.. లంచ్ సెష‌న్ తర్వాత 106 పరుగులు చేసి, భారత బౌలర్లను తికమక పెడుతున్నారు. భారత బౌలింగ్ గత సెషన్‌తో పోల్చితే కొంచెం మెరుగ్గా ఉన్నా, వికెట్లు మాత్రం ద‌క్క‌డం లేదు.

ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 232 పరుగులు వెనుకబడి ఉంది, అయితే రెండో కొత్త బంతి ఇంకా 5 ఓవర్ల దూరంలో ఉంది. ఆ బంతితో భారత్ విజయవంతంగా మెరుపు మెరిపించగలిగితేనే మ్యాచ్ మళ్లీ వారి కంట్రోల్‌లోకి రానుంది. ఈ భాగస్వామ్యం అడ్డుకోలేకపోతే, మ్యాచ్ భారత చేతులు దాటే ప్రమాదం ఉంది. టీ తర్వాత సెషన్ కీలకంగా మారబోతోంది.

Leave a Reply