- కలిపిన పహల్గాం దాడి
- కర్నూలు వాసిగా గుర్తించి తల్లిదండ్రులు వద్ద చేర్చిన పోలీసులు
మంత్రాలయం, జులై 3 (ఆంధ్రప్రభ ) : జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం (Pahalgam) దాడి సంచలనం రేకెత్తించింది. ఈ దాడిని సీరియస్ గా పరిగణించిన భారత ప్రభుత్వం ఆ తర్వాత సింధూర్ పేరిట పొరుగున ఉన్న పాకిస్తాన్ (Pakistan) పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లోని వారి స్థావరాలపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ దాడి తర్వాత.. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని ఉగ్రవాదుల ఆచూకీ కోసం మూలమూలకు వెతుకుతున్న క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుని ఆచూకీ గుర్తించి తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన వైనం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే…మంత్రాలయం (mantralayam) మండలం చెట్నీహళ్లికి చెందిన నారాయణ అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఐదేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఎస్సై శివాంజల్ వివరాల మేరకు.. అతడు రైలులో జమ్మూ కాశ్మీర్ కు వెళ్లాడు. ఇటీవల యుద్ధ సమయంలో అక్కడి పోలీసులు అతడిని గుర్తించారు. వివరాలు ఆరా తీసి మంత్రాలయానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మంత్రాలయం ఎస్సై శివాంజల్ అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అలాగే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎస్ఐ శివాంజల్ (SI Shivanjal) ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర సమాచారం అందించారు. తప్పులు చేస్తే విధించే శిక్షలపై వివరించి, ర్యాగింగ్ కు పాల్పడవద్దని హెచ్చరించారు. విద్యార్థులు చట్ట పరిజ్ఞానంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.