- గిల్ మాస్ ఇన్నింగ్స్,
- బౌలర్ల అద్భుత ప్రదర్శన
బ్యాటింగ్ తో బెంబేలెత్తించిన భారత్.. బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆతిథ్య ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. నేటి హీరో కెప్టెన్ శుభ్‌మన్ తన కెరీర్ లో అత్యుత్తమ 269 పరుగులతో చరిత్ర సృష్టించాడు. వన్డేల్లోనే కాకుండా టెస్టుల్లో కూడా డబుల్ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా గిల్ ఘన రికార్డు సాధించాడు.
గిల్ తో కలిసి రెండో రోజు ఆట కొనసాగించిన రవీంద్ర జడేజా కూడా దృఢమైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరి 203 పరుగుల భాగస్వామ్యం భారత స్థితిని మరింత బలోపేతం చేసింది. సెంచరీ చేస్తాడనుకున్న జడేజా 89 పరుగుల వద్ద జోష్ టోంగ్ చేతిలో ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా గిల్ కు బాగా తోడ్పడ్డాడు. ఈ ఇద్దరూ మరో కీలకమైన 144 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అయితే, టీ విరామానికి ముందు జో రూట్ చేతిలో సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ బ్రేక్ తర్వాత, జోష్ టోంగ్ బౌలింగ్ లో గిల్ కూడా 269 పరుగులకు ఔటయ్యాడు. దీంతో భారతదేశం 587 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆరంభంలోనే కీలక వికెట్లు!
ఇక భారీ లక్ష్యంతో తొలి ఇన్నింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు భారత బౌలర్లు మరింత ప్రమాదకరంగా మారారు. ఆకాష్ దీప్ ఒకే ఓవర్‌లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) రెండు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ జాక్ క్రాలీ (19)ను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 25/3తో దారుణంగా పడిపోయింది.
ఈ దెబ్బల మధ్య జో రూట్ (18) మరియు హ్యారీ బ్రూక్ (30) నిలకడగా ఆడి, నాలుగో వికెట్‌కు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌ను 77/3 వద్ద స్టంప్స్‌కి చేర్చారు. అయినా వారు ఇంకా 507 పరుగుల వెనుకబడి ఉన్నారు.
ప్రస్తుతం జో రూట్ (18) – హ్యారీ బ్రూక్ (30) స్థిరంగా ఆడుతూ, నాల్గవ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జంట నాల్గవ వికెట్ కు 52 పరుగులు జోడించగా… స్టంప్స్ సమయానికి ఇంగ్లాండ్ 77/3 గా నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ ఇంకా 507 పరుగులు వెనుకబడి ఉన్నారు.