సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే రజినీకాంత్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, తాజాగా మరో సంచలన అప్‌డేట్‌తో చిత్రబృందం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఓ పవర్‌ఫుల్ కేమియో రోల్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా ‘దహా’ అనే పాత్రలో కనిపించబోతున్న అమీర్ ఖాన్ స్టైలిష్ లుక్‌ను విడుదల చేశారు.
షర్ట్ లేకుండా, చేతిలో క్లాసిక్ సిగార్‌తో కనిపిస్తున్న ఆయన లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ చూస్తేనే పాత్ర ఎంత మాస్, స్టైలిష్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ మాస్ యాక్షన్ ఫెస్టివల్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.