Formula e – car Race | విచార‌ణ‌కు రండి – నాలుగో సారి ఐఎఎస్ అర‌వింద్ కుమార్ కు పిలుపు

హైద‌రాబాద్ – ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియ‌ర్ అధికారి అరవింద్‌ కుమార్ కు (IAS Arivind kumar) ఏసీబీ (acb ) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరారు ఇప్పటికే అరవింద్‌ కుమార్‌ను మూడుసార్లు విచారించగా, ఇది నాలుగోసారి (fourth time ) కావడం విశేషం.

కాగా, బీఆర్‌ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్‌ రేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Leave a Reply