కర్నూలు బ్యూరో, జులై 2, ఆంధ్రప్రభ : కర్ణాటక (Karnataka) ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్ర జలాశయం నిండుకుంటుంది. దీంతో జలాశయం చెందిన నాలుగు గేట్ గేట్లను పైకెత్తి 10,400 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదులుతున్నారు. ఇదే సమయంలో ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర నది లోకి 32767 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర (Tungabhadra) జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1625 అడుగులకు చేరుకుంది. 105 టీఎంసీలకు కాను, 77, 144 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక జలాశయంకు 32,762 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. కాగా ఈ ఏడాది తుంగభద్ర గేట్ల మరమ్మత్తుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు చేసేందుకు అవకాశం లేకుండాపోయింది. ఈ క్రమంలో నిపుణుల సూచన (Expert advice) మేరకు ప్రస్తుతం జలాశయంలో 80టీఎంసీల నీటిని నిలువ చేయాలనే తలంపుతో ఉన్నారు. దీంతో ఎగువ తుంగ, భద్ర నుంచి వరద నీరు జలాశయంకు చేరుకుంటుంది. దీంతో కనిష్ట స్థాయిలో నీటి నిలువలు చేసుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా.. దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంకు చెందిన నాలుగు గేట్లను రెండు అడుగులు ఎత్తి సుమారు 10,400 క్యూసెక్కుల నీరు దిగివక వదులుతుండడం గమనార్హం.