నీవు చెప్పే అబద్దాల పురాణం గుట్టు రట్టు చేస్తా
చివరికి అపెక్స్ లేని అంశాలపై కూడా డబాయింపులే
మీ వల్ల, ఉత్తమ్ వల్లే చంద్రబాబు బనకచర్లకు తెర తీశారు
మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ కూడా చంద్రబాబు ఇచ్చిందే
బనకచర్ల పై రేవంత్ వ్యాఖ్యాలపై హరీశ్ రావు ఘాటు విమర్శలు
హైదరాబాద్ – బనకచర్ల (banakacharla ) అంశంపై సీఎం రేవంత్ (cm revanth reddy ) చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు (lie ) అని పేర్కొన్నారు బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao ) . బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు (chandrababu ) ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు.
తెలంగాణ భవన్ లో (telangana Bhavan ) నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బనకచర్ల ప్రాజెక్టు ఎవరి హయాంలో ఏపీకి వెళ్లిందో వివరిస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీ (Assembly ) సమావేశం నిర్వహించి.. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బనకచర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, రేవంత్ బండారమంతా అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని తెలిపారు. కానీ.. బనకచర్లపై మాట్లాడేటపుడు మైక్ కట్ చేయకూడదని కండీషన్ పెట్టారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బనకచర్లను కేసీఆరే యాక్సెప్ట్ చేశారని కాంగ్రెస్ చెబుతున్నదానిలో నిజం లేదన్నారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే పనిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు హరీశ్ రావు. ప్రగతి భవన్‌లో పెట్టిన ప్రజంటేషన్ అమరావతిలో తయారు చేసినట్లుగా ఉందని రేవంత్ కు చురకలంటించారు. . చంద్రబాబు తరుపున రేవంత్ రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు ఆపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. బనకచర్ల మీద బొంకుడు రాజకీయాలు పక్కన పెట్టకుంటే ప్రజలు అదఃపాతాళానికి తొక్కుతారని రేవంత్ ను హరీశ్ రావు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ‘చంద్రబాబుతో ఉన్న అనుబంధం మరిచిపోలేకపోతున్నారనన్నారు. . గత సంవత్సరం జులై 6న చం ద్రబాబును ప్రజా భవన్‌కు పిలిచారని, . ఆరోజే బనకచర్లకు పునాది పడిందని అన్నారు. 2024 సెప్టెంబర్ 13 బెజవాడ వెళ్లి.. బజ్జీలు తిని ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లకు లైన్ క్లియర్ చేశారని ఆరోపించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్మలా సీతారామన్‌కు బనకచర్ల ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇవ్వమని చంద్రబాబు లేఖలు రాశారన్నారు. అపెక్స్ లేఖలో లేని విషయాలు చెబుతున్నారని, అందులో రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుందాం అని ఉందని తెలిపారు హరీశ్ రావు. ఆమోదయోగ్యమైన మీటింగ్ ఏపీ ప్రభుత్వంతో జరుగలేదని అంటూ తమ పాలనలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని స్పష్టం చేశారు.. 2016లో బనక చర్ల రాసి ఇచ్చాము అని తప్పుడు మాటలు చెబుతున్నారని రేవంత్ పై విరుచుకుపడ్డారు.. ఈ మీటింగ్ మినిట్స్లో పెన్నా నది పేరు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు నీ బట్టలు విప్పుతాం’ అంటూ రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు.