హైదరాబాద్ – ప్రేమించుకున్నారు.. కలిసి నడుద్దాం అనుకున్నారు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని (New Life ) ప్రారంభించారు.. నీకు నేను.. నాకు నువ్వు అనుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమకు ఆ రెండు కుటుంబాలు (two families ) కూడా ఒప్పుకున్నాయి.. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో(job) చేరారు.. అయితే, వారి ప్రేమను మృత్యువు (Mortal ) కూడా విడదీయలేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా.. మృతదేహాలకు పఠాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేశారు వైద్యులు.. అయితే, ఈ పేలుడులో ఏపీకి చెందిన నవదంపతులు మృత్యువాతపడ్డారు. కడప జిల్లాకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి (Nikhil kumar reddy ) , రమ్యశ్రీ (ramyasri ) దుర్మరణంపాలయ్యారు.. సిగాచి పరిశ్రమ ల్యాబ్‌లో పనిచేస్తున్న నిఖిల్ కుమార్ రెడ్డి, రమ్యశ్రీ.. రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు.. వివాహం అనంతరం ఇటీవలే విధుల్లో చేరారు ఈ నవదంపతులు.. నిన్న జరిగిన పేలుడులో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.. పోస్టుమార్టం చేసిన తర్వాత ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిఖిల్ రెడ్డి మృతదేహాన్ని కడప జిల్లాకు తరలించడగా.. రమ్యశ్రీ డెడ్ బాడీని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు తరలించారు కుటుంబ సభ్యులు..
ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikalapudi srinivasarao ) భావోద్వేగానికి గురయ్యారు.. ఆ నవదంపతులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కన్నీళ్లు ఆగడం లేదని ఆయన పేర్కొన్నారు.. ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి… ఎమ్మెస్సీ చదువుకొని పఠాన్‌చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీ రమ్య.. తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకుంది. పిల్లలు ఇద్దరు అత్యంత సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి స్నేహితులుగా మారిన వాళ్లు పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత… వారి కుటుంబాలకు తెలియజేశారు. వారి ప్రేమ వివాహానికి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలలపాటు తీవ్ర మనోవేదన అనుభవించిన ఆ యువ జంట… సహాయం కోసం నాతో మాట్లాడారని గుర్తుచేసుకున్నారు..
నేను మొదట నిఖిల్ రెడ్డి అమ్మగారితో మాట్లాడాను… ఆమె చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు… నాకు ఇద్దరు మగ పిల్లలు… ఇప్పుడు నా పెద్ద కొడుకు నిఖిల్… ఇష్టపడి రమ్యని కోడలుగా మా ఇంటికి తీసుకు వస్తే… ఆ పాపని మా సొంత కూతురు లాగా చూసుకుంటాం అన్నారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు పేర్కొన్నారు.. వాళ్ల పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అని ఆ తల్లి చెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత.. రమ్య కుటుంబ సభ్యులకు నేనే ధైర్యం చెప్పి, రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు మొదలుపెట్టాం.. రెండు కుటుంబాలు కలుసుకున్నాయి.. రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుని, ఆషాడ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్లి చేద్దామని నిర్ణయానికి వచ్చారని తెలిపారు.. అయితే, ఇది జరిగిన తర్వాత.. పిల్లలిద్దరిని హైదరాబాద్‌లో మా ఇంటికి పిలిచి.. ధైర్యం చెప్పి.. బట్టలు పెట్టి పంపించడం జరిగింది.. అంటూ దానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. నాలుగు రోజుల క్రితం రమ్య కుటుంబ సభ్యుల నుండి… త్వరలో నిశ్చితార్థం పెట్టుకుంటాము.. మీరు తప్పనిసరిగా రావాలి. అని ఆహ్వానం అందింది. నేను కూడా వస్తాను అని చెప్పినట్టు పేర్కొన్నారు..
అయితే, నిన్న తిరువూరు నియోజకవర్గంలో వరుస కార్యక్రామలతో బిజీగా ఉన్న నాకు… ఫార్మా కంపెనీలో పేలుడు గురించి, భారీ ప్రాణ నష్టం గురించి తెలియగానే.. ఈ పిల్లలు పనిచేస్తున్న కంపెనీ పేరు తెలుసుకోవటానికి… ముందుగా నేను నిఖిల్ రెడ్డికి ఫోన్ చేశాను.. ఆ తర్వాత రమ్య కి ఫోన్ చేశాను.. ఇద్దరి నుంచి స్పందనలేకపోవడంతో.. రమ్య అక్కకు ఫోన్ చేశాను రెస్పాన్స్ లేదు.. తర్వాత టీవీ ఛానల్స్‌లో పేలుడు.. మృతుల్లో ఏపీకి చెందిన వారు ఉన్నట్లు చూశానని.. తర్వాత హైదరాబాద్ బయల్దేరి సాయంత్రం 6 గంటల వరకు ఫార్మా కంపెనీకి చేరుకున్నాను.. రమ్య అక్క జ్యోత్స్న… ఆమె స్నేహితులు మరో ముగ్గురు తీవ్ర విషాదంలో అక్కడే ఉన్నారని భావోద్వేగానికి గురయ్యారు.. అక్కడున్న కలెక్టర్ తో, పోలీస్ అధికారులతో మాట్లాడినప్పటికీ ఎవరు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన అనేక మృతదేహాలను.. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న మూడు నాలుగు ఆసుపత్రులకు తరలించారు.
ఉదయం నుంచి వర్షంలోనే తడుస్తూ…. కంపెనీ దగ్గరే ఉన్న రమ్య అక్కను.. ఆమె స్నేహితులను వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసి, నేను రాత్రి 9 తర్వాత మా ఇంటికి చేరుకున్నాను. ఉదయాన్నే బయలుదేరి మళ్లీ కంపెనీ దగ్గరికి వెళ్లాలని రాత్రి అనుకున్నాము. అయితే తెల్లవారే సమయానికి… నిఖిల్ రెడ్డి పాత రూమ్ మెట్ ఫోన్ చేసి.. వాళ్లిద్దరూ మనకు లేరు సార్ అని చెప్పాడు. మరి కాసేపటికి ….. ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్టు.. ఆసుపత్రి నుండి రమ్య అక్కకు సమాచారం అందింది. ఈ మహా విషాదాన్ని తట్టుకోవడం… రెండు కుటుంబాలకు చాలా చాలా కష్టం. ఆ తల్లిదండ్రులు తట్టుకోలేని చేదు నిజం మిగిలింది. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు..
ఇక, మా నాన్న 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు… మా నాన్నకు ఏదైనా సహాయం చేయండి సార్ అని.. మొన్న రమ్య మా ఇంటికి వచ్చినప్పుడు అడిగింది. గత సంవత్సర కాలంలో ఆమె తల్లిదండ్రులు రెండుసార్లు నన్ను కలిశారు. మరి కొద్ది రోజుల్లో జరగబోయే పెళ్లి సందర్భంగా వాళ్ళింటికి వస్తానని చెప్పాను. ఇంతలోనే… ఒక కన్నీటి ఉప్పెన…. ఆ పిల్లల స్వప్నాలను తుడిపేసింది. ఆ తల్లిదండ్రుల గుండెలకు చికిత్స లేని గాయం చేసింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగని కన్నీళ్లతో మీ కొలికపూడి శ్రీనివాసరావు అంటూ బరువెక్కిన గుండెతో ఓ ప్రకటన విడుదల చేశారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. కాగా, నిఖిల్ కుమార్ రెడ్డి, రమ్యశ్రీ.. ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నా.. ఆ రెండు కుటుంబాలు మరోసారి వారికి గ్రాండ్‌గో వివాహం చేయాలని అనుకోగా.. ఇంతలోనే.. ఊహించని ఘటన.. ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది..