హైదరాబాద్ – ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ(Swetcha ) ఆత్మహత్య (Sucide) కేసులో ఆమె మరణానికి తానే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ పూర్ణచందర్ (Purnachandra rao ) , శనివారం రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో (chikkadapalli ) లొంగిపోయాడు పూర్ణచందర్. స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణచందర్ కారణమంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు(mother and father ) చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసుల ముందు పూర్ణ చందర్ లొంగి పోయాడు.
ఇదే సమయంలో పూర్ణచంద్రరావు ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో స్వేచ్ఛ జీవితం, వారి సంబంధం, ఆమె మానసిక స్థితి, కుటుంబ నేపథ్యంకి సంబంధించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తనకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసని, ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్‌లో పని చేశామని చెప్పారు. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను తనతో పంచుకుంటూ ఉండేదని గుర్తుచేశారు. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైందని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే అని పూర్ణచందర్ ఆరోపించారు.
“చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేసాయని చెప్పారు.
2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా తన వద్దకు తీసుకువచ్చిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది అని వివరించారు. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నానని తెలిపారు. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా ఉండలేదని పూర్ణచందర్ తెలిపారు. ఆమె తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేదని పేర్కొన్నారు. ఒకవైపు స్వేచ్ఛ మానసిక స్థితిపై పూర్ణచందర్ వివరణలు ఇస్తుండగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు మాత్రం పూర్ణచందరే ఆమెను మోసం చేశాడని గట్టిగా చెబుతున్నారు. రానున్న రోజులలో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.