Threatning Mails | నేడు కూడా ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనేఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి.ఈ-మెయిల్ ద్వారా వార్నింగ్ రావడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది స్కూళ్లలో తనిఖీలు చేశారు.
అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మయూర్ విహార్‌లోని అహ్లాకాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు ప్రిన్సిపల్ పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు టెలిఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.