AP | క్రీడాకారుకు గుడ్ న్యూస్.. పెండింగ్ ప్రోత్సాహకాలు రిలీజ్ !

  • రూ.11.5 కోట్లకు పైగా నిధులు పెండింగ్‌
  • దాదాపు రూ.8 కోట్ల నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని క్రీడాకారులకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక నిధులను విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటించినా నిధులు విడుదల కాలేదు.

దీంతో విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. ఏపీ క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ ఎస్ఏపీ చైర్మన్ రవినాయుడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు వెంటనే నిధులు విడుదల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో సుమారు 224 మంది క్రీడాకారులకు రూ.11,68,62,288 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయని సాప్ చైర్మన్ రావినాయుడు వివరించారు. ఇవాళ‌ కూటమి ప్రభుత్వం 189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 కోట్ల ప్రోత్సాహక నిధులను విడుదల చేసిందని సాప్ చైర్మన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *