విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness Record) స్థానం దక్కించుకుంది. ఒకేసారి మూడు లక్షల మంది(three lakhs ) ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు. ఆ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర (Visakha Yogandhra) కార్యక్రమం దాటేసింది. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోబోతోంది. సూరత్ రికార్డ్‌ను అధిగమించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్‌లోని సూరత్‌లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర-2025’ అధిగమించడం విశేషం. ఈ భారీ జనసమీకరణతో గతంలో సూరత్‌లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది.


కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కాగ, శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు.
