NZB | మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి : ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 18(ఆంధ్రప్రభ) : శరీరానికి ఉన్న అంగ వైకల్యాన్ని మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. స్నేహ సొసైటీ (sneha society) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ (New Ambedkar Bhavan) లో నిర్వహించిన వికలాంగుల బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ (Dhanapal Suryanarayana) హాజరై మాట్లాడారు. వికలాంగుల బడిబాట కార్యక్రమంతో అంగవైకల్యం ఉన్న విద్యార్థుల్లో, తల్లితండ్రుల్లో మనో శక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు.

విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దుతుందన్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్దయ, ప్రిన్సిపల్ జ్యోతి, సీడీపీఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వీరేషం, పీసీ చైర్మన్ బాబాగౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు, RMO డాక్టర్ హుమేర బేగం పాల్గొన్నారు.

Leave a Reply