హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈ సాయంత్రం కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట, బచ్చుపల్లి, గజులరామారం, జీడియేడ్‌మెట్‌లా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదైంది. వర్షం కొద్ది నిమిషాల్లోనే అధికంగా కురుస్తూ, ఆ ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
ప్రస్తుతం వర్షపు తీవ్రత మల్కాజిగిరి, తిరుమలగిరి, బాలానగర్, సనత్‌నగర్, నేరేడ్‌మెట్, కార్ఖానా, బోయిన్‌పల్లి, బేగంపేట ప్రాంతాలవైపు వేగంగా విస్తరిస్తోంది. వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో తదుపరి ఒక గంటపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వర్షం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.