TTD సీఐఓ గా సాయి ప్రసాద్..

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ను తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు (జి ఓ నెం 1104) జారీ అయ్యాయి. 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

తాజా నియామకంతో సాయి ప్రసాద్ అవసరాన్ని బట్టి టీటీడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను, కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను కూడా అదనంగా నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. టీటీడీ చరిత్రలో ఇటువంటి పోస్ట్ ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగిన విశేషం.

Leave a Reply