AP | ఆన్ లైన్ లో డిఎస్సీ హాల్ టికెట్స్ …

అమరావతి: ఎపి ప్ర‌భుత్వం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6వ తేదీ నుంచి జులై 6 వరకు రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయని డీఎస్సీ కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం – అధికారిక AP DSC పోర్టల్‌ను సందర్శించండి: https://apdsc.apcfss.in – హోమ్‌పేజీలో “డౌన్‌లోడ్ హాల్ టికెట్” లింక్‌పై క్లిక్ చేయండి. – మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి. – మీ హాల్ టికెట్‌ను యాక్సెస్ చేయడానికి “సమర్పించు” పై క్లిక్ చేయండి. – హాల్ టికెట్‌‌ PDF ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలు – ఏపీ డీఎస్సీ 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లాలి. – ఏపీ డీఎస్సీ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) హార్డ్ కాపీ – రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు – ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ID. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్.

Leave a Reply