AP : వైఎస్ జగన్ రేపటి పొదిలి పర్యటన వాయిదా

వెలగపూడి : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు (బుధవారం) జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించాల్సి ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు వైసీపీ తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయంపై ప్రకటన చేస్తామని వెల్లడించింది. పొగాకు పంటకు మద్దతు ధర లేక రైతాంగం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలను తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావించారు.
