ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు ఎదురవుతున్న ఆర్థిక బాధలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు బకాయిలు చెల్లించలేకపోవడంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి బైజూస్ లెర్నింగ్ యాప్‌ను తొలగించారు. ఈ మేరకు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది.
బైజూస్ బ్రాండ్ కింద పనిచేస్తున్న థింక్ అండ్ లెర్న్‌తో పాటు మరికొన్ని అనుబంధ యాప్‌లు మాత్రం గూగుల్ ప్లే స్టోర్‌లో కొనసాగుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన బైజూస్ యాప్ తొలగించినా, బైజూస్ ప్రీమియం లెర్నింగ్ యాప్, ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్‌లు మాత్రం ప్రస్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.